కేటీఆర్ కామెంట్స్ సీతక్క సీరియస్
అహంకారానికి కేరాఫ్ మీ కుటుంబం
హైదరాబాద్ – తెలంగాణ స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి దాసరి సీతక్క నిప్పులు చెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గవర్నర్ ను, సీఎం రేవంత్ రెడ్డిలను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొంది.
శుక్రవారం దాసరి సీతక్క మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడటం మానుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ మీ కుటుంబం అంటూ మండిపడింది.
అందుకే ప్రజలు నేలకేసి కొట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. దొర పాలనకు ప్రతిరూపమే మీ వ్యక్తిత్వం అంటూ మండిపడ్డారు దాసరి సీతక్క.
అన్ని వ్యవస్థలను నాశనం చేసింది కాక పైగా తమపై లేని పోని ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో మీరు చేసిన బండారాన్ని బయట పెట్టడం ఖాయమని హెచ్చరించారు దాసరి సీతక్క.