కేశినేనిని కలిసిన విజయ సాయి
పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం
విజయవాడ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నట్టుండి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనను పార్టీ పట్టించు కోవడం లేదని ఆయన గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇదే సమయంలో తన కూతురు బెజవాడలో 11వ వార్డు కార్పొరేటర్ గా గెలుపొందారు. కేశినేని శ్వేత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గౌరవం లేని చోట ఎందుకు ఉండాలని ప్రశ్నించారు.
తమను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా తాము తట్టుకుని నిలబడ్డామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నారా లోకేష్ పై సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఏం తెలుసని తమను వద్దని అనుకున్నారో చెప్పాలని నిలదీశారు. దీంతో తాము పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు తండ్రీ కూతురు.
ఈ సమయంలో కేశినేని నాని ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే దానిపై ఆయన అనుచరులు కొంత ఉత్కంఠకు లోనయ్యారు. టీడీపీలో ఉన్నా లేకుండా పోయిందన్నారు. తాను పార్టీని నిలబెట్టానని ఈ సందర్భంగా అన్నారు. ఈ తరుణంలో కేశినేని నానిని తమ పార్టీలోకి రావాల్సిందిగా వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ విజయ సాయి రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయనకు భరోసా ఇచ్చారు. దీంతో నాని సీఎం జగన్ రెడ్డిని కలుసుకున్నారు.