కేశినేని నాని అప్పుల అప్పారావు
కేసులు తప్పించుకునేందుకే డ్రామా
విజయవాడ – ఎంపీ కేశినేని నానిపై నిప్పులు చెరిగారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. 2014-19 మధ్య కాలంలో కేశినేని ఆస్తులు పెంచుకుని అప్పులు తగ్గించుకున్నారంటూ ఆరోపించారు. బోండా ఉమ మీడియాతో మాట్లాడారు.
కేసుల భయంతోనే కేశినేని తన ట్రావెల్స్ సంస్థను మూసి వేశాడని ధ్వజమెత్తారు . అప్పులు తీసుకోవడం
వాటిని ఎగ్గొట్టడం నానికి అలవాటుగా మారిందని అన్నారు బోండా ఉమ. కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని ఆరోపించారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకోవడం ఆపై వాటిని తీర్చకుండా ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు.
కేశినేని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులన్నీ ఎన్పీఏ స్టేజిలో ఉన్నాయని ఆరోపించారు బోండా ఉమ. కేశినేని అప్పుల అప్పారావు అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ కేశినేని టీడీపీలో చేరారని ఆరోపించారు. ఎంపీ టికెట్ తీసుకున్నారని ఆ తర్వాత పార్టీకి ద్రోహం చేశారంటూ ఆవేదన చెందారు.
కేశినేనికి టికెట్ ఇప్పించడంలో సుజనా చౌదరి పాత్ర ఉందన్నారు. 2014లో పార్టీ కోసం కేశినేని నాని ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. నాని తరపున సుజానే ఖర్చు పెట్టారంటూ ఆరోపించారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశారంటూ ఫైర్ అయ్యారు బోండా ఉమ.
తమ వద్ద ఫైనాన్స్ తీసుకుని బస్సులను అమ్మేశారంటూ శ్రీరాం ఫైనాన్స్ సంస్థ కేశినేని నానిపై కేసులు పెట్టారంటూ తెలిపారు. తన మీద పోటీ చేస్తే కేశి నేని నానికి డిపాజిట్ రాదన్నారు .