కొలువు తీరిన శ్రీరాముడు
ప్రాణ ప్రతిష్ట చేసిన మోదీ
ఉత్తర ప్రదేశ్ – అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట చేపట్టారు. దీంతో 500 ఏళ్ల సుదీర్ఘ నాటి కల ఇవాల్టితో ఫలించింది. ఎక్కడ చూసినా శ్రీరాముడి నామ జపంతో దద్దరిల్లింది. దేశ వ్యాపంగా శ్రీరాముడి నామ సంకీర్తనతో నిండి పోయోఇంది. రాముడి శోభ యాత్ర ఘనంగా నిర్వహించారు.
దేశానికి చెందిన 7,000 మంది సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూసింది ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కోట్లాది మంది వీక్షించారు.
ముందుగా అయోధ్య లోని బాల రాముడి ప్రాణ ప్రతిష్ట పూర్తయింది. మోదీ దగ్గరుండి పూజలు జరిపించారు. ఈ కార్యక్రమం అభిజిత్ లగ్నంలో జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పూర్తయింది.
అంతకు ముందు అయోధ్య రామాలయంపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు. అంతకు ముందు ప్రధాన మంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గర్భ గుడిలో పూజలు చేశారు. శ్రీరాముడికి మోదీ కాటుక దిద్దారు. దీంతో శోభాయమానంగా ఆ ప్రాంతం నిండి పోయింది.