NATIONALNEWS

కోటి ఇళ్ల‌ల్లో సోలార్ వెలుగులు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను జీవితంలో అద్భుత‌మైన ఆనందానికి లోన‌య్యానని పేర్కొన్నారు. అయోధ్య‌లో రామ మందిరం పునః నిర్మించ‌డం అనేది నా స్వ‌ప్నం, ల‌క్ష్యం కూడా. ఇది పూర్త‌యింది. ఇంకొక ల‌క్ష్యం దాగి ఉంది. అదేమిటంటే భార‌త దేశాన్ని ప్ర‌పంచంలో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బెట్ట‌డం. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఎలాంటి విద్యుత్ వినియోగం లేకుండానే ఆ సూర్య భ‌గ‌వానుడి సాయంతో వెలుగులు పంచాల‌న్న‌ది త‌న టార్గెట్ అని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి.

శ్రీ‌రాముడి కాంతి ఎల్ల‌వేళ‌లా ప్ర‌తి ఒక్క‌రికీ ద‌క్కాల‌ని తాను ప్రార్థించిన‌ట్లు పేర్కొన్నారు. అయోధ్య‌లో ప‌విత్రోత్స‌వం ముగిసింది. శ్రీ‌రాముడు కొలువు తీరాడు. యావ‌త్ దేశం సంబురాల‌లో మునిగి పోయింది. శ్రీ‌రామ నినాన‌దంతో మారుమ్రోగింది. త‌మ ఇళ్ల పైక‌ప్పుపై స్వంత సోలార్ రూఫ్ టాప్ ప‌ద్ద‌తిని క‌లిగి ఉండాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.

నా ల‌క్ష్యానికి మ‌రింత బ‌లం చేకూర్చేలా అయోధ్య చేసింద‌న్నారు. అక్క‌డి నుంచి ఢిల్లీకి వ‌చ్చాక తొలి నిర్ణ‌యం ఏమిటంటే ప్ర‌భుత్వం ఒక కోటి ఇళ్ల‌పై రూఫ్ టాప్ సోలార్ ను ఏర్పాటు చేయాల‌ని. ఇందు కోసం ప్ర‌ధాన మంత్రి సూర్యోద‌య యోజ‌న ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు.