కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సీరియస్
ఎన్నికల సంఘానికి ఆదేశం
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో హుజూరాబాద్ శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన కూతురు, భార్యతో కలిసి క్యాంపెయిన్ చేపట్టారు. ఇదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఎమ్మెల్యే వైరల్ గా మారారు. దీనికి కారణం తనను గెలిపించక పోతే తనతో పాటు భార్య, కూతురు సూసైడ్ చేసుకుంటామని హెచ్చరించారు.
దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. గెలిపిస్తే విజయ యాత్ర చేస్తా లేదంటే శవ యాత్ర కు మీరంతా రావాలని కోరారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా బెదిరింపు ధోరణిలో ఉన్నాయని విమర్శలు కూడా వచ్చాయి.
గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై పలువురు మండిపడ్డారు. ఇదే సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, కేటీఆర్, కేసీఆర్ అండ చూసుకుని రెచ్చి పోయాడు. గవర్నర్ అన్న సోయి లేకుండా చులకన చేస్తూ మాట్లాడాడు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. గురువారం తమిళి సై సౌందర రాజన్ సీరియస్ అయ్యింది.
పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. వెంటనే ఎమ్మెల్యేపై వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది.