క్రీడల్లో యువత రాణించాలి
పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
చెన్నై – తాము దేశంలో కొలువు తీరాక క్రీడా రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. తమిళనాడులోని చెన్నై లో డీఎంకే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా యూత్ క్రీడలను నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా ఆయన యూత్ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ , తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు.
అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య పరంగా మరింత మెరుగయ్యేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు ప్రధానమంత్రి.
రాష్ట్ర ప్రభుత్వం తనను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి దేశ అభివృద్ది కోసం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కోరారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రపంచ క్రీడా రంగంలో క్రికెట్ తో పాటు ఇతర విభాగాలలో భారత దేశానికి చెందిన క్రీడాకారులు , ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు.
తమ ప్రభుత్వం వారికి అండదండలు అందిస్తోందని చెప్పారు. ఎంత ఖర్చు అయినా సరే తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు ప్రధానమంత్రి.