ఖర్గే పిలిచినా పలకని సీఎం
బీజేపీతో కలిసి ప్రభుత్వం
బీహార్ – దేశ రాజకీయాలలో విలక్షణమైన నాయకుడిగా గుర్తింపు పొందారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఇప్పటి వరకు ఐదుసార్లు ఢోకా ఇచ్చారు. తను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మధ్యన బీజేపీతో పడక కాంగ్రెస్ పార్టీతో జత కట్టాడు. ఆపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, అధినేతలతో చర్చలు జరిపారు.
ఇదే సమయంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా, రాహుల్ గాంధీలను కలుసుకున్నారు. ఉద్దవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్ , మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ , భగవంత్ మాన్ లతో కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసేలా కీలక పాత్ర పోషించారు.
దేశ వ్యాప్తంగా నితీశ్ కుమార్ చర్చనీయాంశంగా మారారు. దీనికి ప్రధాన కారణం కూటమిని ఏర్పాటు చేశాక ఉన్నట్టుండి గుడ్ బై చెప్పడం. తిరిగి ఆయన బీజేపీ సంకీర్ణ సర్కార్ వైపు మళ్లారు. ఇందుకు సంబంధించి బీహార్ గవర్నర్ కీలక ప్రకటన చేశారు.
జనవరి 28న నితీశ్ కుమార్ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించు కోవాలని ఆదేశించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠ భరితంగా మారింది