గుంటూరు కారం టీం ఖుషీ
అంతటా పాజిటివ్ టాక్
మాటల మాంత్రికుడు, దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి నుంచీ ఆయన తీసే సినిమాలపై జనాలకు క్యూరియాసిటీ ఎక్కువ. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే గుంటూరు కారం విడుదలైంది. అక్కడ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అద్భుతంగా ఉందని , ఇక మహేష్ బాబుకు తిరుగే లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇదిలా ఉండగా గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. అభిమానుల తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. మహేష్ బాబును చూసేందుకు తొక్కిస లాట జరిగింది.
ఇదే సమయంలో సినీ రంగానికి వచ్చి మహేష్ బాబు 25 ఏళ్లవుతోందని దర్శకుడు త్రివిక్రమ్ తెలిపారు. టాలీవుడ్ లో అందరు హీరోలు 100 శాతం చేస్తే ప్రిన్స్ మాత్రం 200 శాతం చేస్తాడంటూ కితాబు ఇచ్చాడు. అయితే గుంటూరు కారం టీంకు సంబంధించిన విమానం ఫోటోలు వైరల్ గా మారాయి. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ , నిర్మాతలు దిల్ రాజు , నాగ వంశీ, నటీ నటులు మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ఉన్నారు.