గుంటూరు కారం సంచలనం
సంక్రాంతికి సినిమా సిద్దం
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓవర్సీస్ లో కోలాహలం నెలకొంది. ప్రిన్స్ మహేష్ బాబు , శ్రీలీల కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బ్రేక్ చేస్తోంది.
మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ తోడు కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 12న థియేటర్ల ముందుకు రానుందని నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. దీంతో సినిమా టాకీసుల ముందు క్యూ కడుతున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ మూవీకి సంబంధించి రోజుకో పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో మరింత హైప్ పెరుగుతోంది ఈ చిత్రంపై. ఇక మాటల మాంత్రికుడిగా పేరు పొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబుకు ఇది మూడో సినిమా.
గతంలో ఆయన అతడు తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో సినిమా అనుష్కతో కలిసి ఖలేజా తీశాడు. ఇది కూడా హిట్టే. ఇక ప్రస్తుతం గుంటూరు కారం సినీ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఈ చిత్రం కంటే ముందు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తీశాడు. ఇక గుంటూరు కారం తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.