గ్లాండ్ ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో సోదాలు
హైదరాబాద్ – ఆదాయ పన్ను శాఖ దూకుడు పెంచింది. మార్చి లోపు ఆదాయ వ్యయాలకు సంబంధించి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఆయా కంపెనీలు. అనుమానం వచ్చిన ఆయా కంపెనీలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సోదాలకు తెర లేపింది. దాడులను ముమ్మరం చేసింది.
దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలకు కేరాఫ్ గా హైదరాబాద్ నిలిచింది. మంగళవారం ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఫార్మాస్యూటికల్ కంపెనీ గ్లాండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
జూబ్లీ హిల్స్ లోని కంపెనీ కార్యాలయం, డైరెక్టర్ల నివాసాలు, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తేలిఇంద.ఇ ఆయా తయారీ కేంద్రాలలో దాడులు చేపట్టారు.
కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న బిఎన్ మల్లేశ్వరరావు, మరో ఐదుగురు డైరెక్టర్లపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు విభాగం సోదాలు నిర్వహించింది.
గ్లాండ్ కెమికల్స్ 1974లో విలీనం చేయబడింది. క్యాన్సర్ నిరోధక మందులు, ప్రతిస్కందకాలు, న్యూరోమస్కులర్ బ్లాకింగ్ విభాగాలు, ఉపశమన యాంటీ ,ప్లేట్‌లెట్ విభాగాలను తయారు చేస్తోంది గ్లాండ్ ఫార్మా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ.