DEVOTIONAL

ఘనంగా పార్వేట ఉత్సవం

Share it with your family & friends

ద‌ర్శించుకున్న భ‌క్తులు

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో ఘ‌నంగా పార్వేట ఉత్స‌వాన్ని నిర్వ‌హించారు. శ్రీ మలయప్ప స్వామి వారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదన హారతులు జరిగాయి. అనంత‌రం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠం వారికి మర్యాదలు నిర్వ‌హించారు.

శ్రీ కృష్టస్వామి వారిని సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. శ్రీ మలయప్ప స్వామి వారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణము వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది.

శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవము పూర్తయి మహా ద్వారమునకు వచ్చి హత్తీరాంజీ వారి బెత్తమును తీసుకొని సన్నిధి లోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసింది.

ఈ ఉత్సవంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో వీర బ్ర‌హ్మం పాల్గొన్నారు.