చంద్రబాబును జనం నమ్మరు
పవన్ కళ్యాణ్ కు అంత సీన్ లేదు
అమరావతి – ఏపీ మంత్రి జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నాడని, కానీ ఆయన కోరుకున్నది ఏదీ సాధ్యం కాదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు జోగి రమేష్.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయని టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా బురద చల్లినా జనం నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా , పవన్ కళ్యాణ్ ఎంతగా అరిచినా వర్కవుట్ కాదన్నారు.
విచిత్రం ఏమిటంటే ఇద్దరూ వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే ఈ నాయకులకు తగిన రీతిలో బుద్ది చెప్పే రోజు తప్పకుండా వస్తుందన్నారు జోగి రమేష్.
ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాము ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ నమోదు చేస్తున్న దొంగ ఓట్ల గురించి సీఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
వాలంటీర్లు స్వచ్చంధంగా ప్రజలకు సేవలు చేస్తున్నారని, వారిపై నోరు పారేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు మంత్రి. ఇకనైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మౌనంగా ఉంటే బావుంటుందని సలహా ఇచ్చారు.