చచ్చినా సరే వైసీపీలో చేరను
ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం
అమరావతి – కాపు సామాజిక ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన కామెంట్స్ చేశారు. తాను చచ్చినా సరే జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ పార్టీలో చేరే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు. తనను కలిసేందుకు ప్రయత్నం చేశారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఈ సందర్బంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మిమ్మల్ని కలవాలని అనుకోవడం లేదని అన్నారు ముద్రగడ పద్మనాభం.
తమ భావజాలానికి మీ రెడ్డి ఆలోచనలకు పొసగదని తేల్చి చెప్పారు. ఆయనను కలిసేందుకు ఇష్ట పడలేదు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరుతానని లేదంటే పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేశారు. లేదంటే ఎక్కడా కుదరక పోతే ఇంట్లో కూర్చుంటానని అన్నారు ముద్రగడ పద్మనాభం.
వైసీపీలో రావాలని అనుకోవడం లేదన్నారు. తాను కాపులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటం చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం 10 ఏళ్లు వెనుకబాటుకు లోనైందని ఆరోపించారు. ప్రజలను బలి పశువులుగా మార్చేశారంటూ ఆరోపించారు.