ENTERTAINMENT

చెర్రీకి అయోధ్య ట్ర‌స్టు ఆహ్వానం

Share it with your family & friends

రామ మందిరం ప్రాణ ప్ర‌తిష్ట

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా ఈనెల 22న అయోధ్య‌లో జ‌రిగే రామ మందిరం ప్రాణ ప్ర‌తిష్ట‌కు సంబంధించి ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే వేలాది మంది అక్క‌డికి చేరుకుంటున్నారు. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు అయోధ్య రామ మందిరం ట్ర‌స్టు స‌భ్యులు స్వ‌యంగా క‌లిసి ఈ అరుదైన కార్య‌క్ర‌మానికి రావాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ కు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ , జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ కు ఇన్విటేష‌న్ ఇచ్చారు.

తాజాగా గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ను క‌లిశారు అయోధ్య రామ మందిర్ ట్ర‌స్ట్ నిర్వాహ‌కులు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ట్ర‌స్టు త‌ర‌పున ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. రామ్ చ‌ర‌ణ్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మం న‌భూతో న‌భవిష్య‌త్ అన్న రీతిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్బంగా తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ ఈ అయోధ్య రామ మందిరం అన్న‌ది ముఖ్య‌మ‌న్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా రాముడి నామ జ‌పంతో త‌రిస్తోంద‌ని ఆల‌య ట్ర‌స్టు స‌భ్యులు తెలిపారు. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. మీరు త‌ప్ప‌కుండా రావాల‌ని కోరారు. దీనికి స‌మ్మ‌తి తెలిపారు రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు.