ఈ దేశం కోతి చేతిలో పూల దండ
ఆర్బీఐ మాజీ చైర్మన్ రఘురామ్ రాజన్
ముంబై – ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ చైర్మన్ రఘురామ్ రాజన్. దేశం ప్రస్తుతం కోతి చేతిలో పూల దండగా మారిందన్నారు. తాను కాంగ్రెస్ వాదినో, కమ్యూనిస్టునో, మోడీ భక్తుడినో కాదన్నారు.
నేను నా దేశాన్ని ప్రేమించే సాధారణ పౌరుడిని మాత్రమేనని పేర్కొన్నారు. గత 70 ఏళ్లలో కుల, మతాలకు అతీతంగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. ఇందుకోసం దేశాన్ని పాలించిన పీఎంలంతా అహోరాత్రులు శ్రమించారని తెలిపారు. దీని వల్లనే ఇవాళ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మారిందన్నారు.
మోదీ పుట్టక ముందే పాకిస్తాన్ పై ఇండియా యుద్దంలో గెలిచిందన్నారు రాజన్. మోదీజీ మాట్లాడటం మొదలు పెట్టక ముందే ప్రపంచం లోనే అత్యుత్తమమైన రాజ్యాంగం దేశానికి ఉందన్నారు. ప్రధాని కోలాటం ఆడక ముందే భారత్ భాక్రా నంగల్ కాలువను నిర్మించిందన్నారు.
ఆయన పుస్తకాన్ని తిరిగేస్తున్నప్పుడు అణు పరిశోధనా కేంద్రాన్ని తెరిచిందని గుర్తు చేశారు. దీపం వెలిగించడం నేర్చుకుంటున్నప్పుడు తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిందన్నారు రాజన్. ఆయన దుస్తులు ధరించక ముందే ఇండియాలో బట్టలు తయారు చేయడం నేర్చుకున్నారని తెలిపారు.
ఎయిమ్స్, ఐఐటీతో పాటు ఇతర విశ్వ విద్యాలయాలు ప్రారంభించడం జరిగిందన్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లు వేగంగా నడుస్తున్నప్పుడు మోదీజీ టీ అమ్ముతున్నారని గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే మోదీ పాలనలో దేశం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు రఘురామ్ రాజన్.