NEWSTELANGANA

జ‌గ‌న్ పై రేవంత్ గుస్సా

Share it with your family & friends

సంచ‌ల‌న కామెంట్స్ వైర‌ల్

హైద‌రాబాద్ – త‌న‌కు ఎవ‌రితో పేచీలు లేవంటూనే ప్ర‌క‌టించిన నూత‌న ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్న‌ట్టుండి స్వ‌రం మార్చారు. ప‌క్క‌నే ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. మ‌ర్యాద పూర్వ‌కంగానైనా త‌న‌కు ఫోన్ చేయ‌లేదంటూ బాంబు పేల్చారు.

న‌రేంద్ర మోదీ తిరిగి దేశానికి ప్ర‌ధాన మంత్రి కావాల‌ని జ‌గ‌న్ కోరుకుంటున్నార‌ని కానీ తాను రాహుల్ గాంధీ పీఎం కావాల‌ని , ఆయ‌న సారథ్యంలోనే దేశం అన్ని రంగాల‌లో ముందుకు వెళుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

విచిత్రం ఏమిటంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఊహించ లేద‌ని తాను గెలుస్తాన‌ని, కానీ ఆయ‌న కేసీఆర్ కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ఆరోపించారు. ష‌ర్మిల ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

పార్టీ చీఫ్ గా, సీఎంగా త‌న‌కు కూడా కొంత బాధ్య‌త ఉంటుంద‌న్నారు. ఎవ‌రు ఎప్పుడు గెలుస్తారో ఎవ‌రూ చెప్ప‌లేర‌న్నారు. త‌న‌కు కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇచ్చింద‌ని, కేవ‌లం తాను రుణం తీర్చు కోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

త‌న జీవితంలో ఒకే ఒక్క కోరిక పెట్టుకున్నాన‌ని అది సీఎం కావాల‌ని, అది కూడా పూర్త‌యింద‌న్నారు. రాహుల్ గాంధీ న‌మ్మే జాబితాలో తన పేరు త‌ప్ప‌కుండా ఉంటుంద‌న్నారు రేవంత్ రెడ్డి.