జగన్ రెడ్డితో కేశినేని ములాఖత్
చక్రం తిప్పిన విజయ సాయి రెడ్డి
అమరావతి – ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు గుడ్ బై చెబుతుండగా మరికొందరు ఇతర పార్టీల నుండి వైసీపీ లోకి జంప్ అవుతున్నారు.
తాజాగా విజయవాడ ఎంపీగా ఉన్న కేశి నేని నాని ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నారు. ఏమైందో ఏమో కానీ ఆయనను రాజీనామా చేయాల్సిందిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీంతో తనతో పాటు కూతురు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదే సమయంలో కేశి నేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ లో లేదా జనసేన పార్టీ లోకి జంప్ అవుతారని అంతా భావించారు. కానీ ఉన్నట్టుండి వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపడం విస్తు పోయేలా చేసింది.
బుధవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు ఎంపీ కేశి నేని నాని. ఆయనకు పుష్ప గుచ్చం ఇచ్చారు. ఈ సందర్బంగా పూర్తి హామీ ఇచ్చినట్టు సమాచారం.
మొత్తంగా కేశి నేనికి సీటు కన్ ఫర్మ్ చేసినట్టు సమాచారం. కాక పోతే అసెంబ్లీ బరిలో ఉంటారా లేక లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇక కేశినేని చేరికతో బెజవాడ రాజకీయాలు మరింత మారనున్నాయి.