జగమెరిగిన నేత జైపాల్ రెడ్డి
స్పూర్తి స్థల్ లో నివాళులు
హైదరాబాద్ – జనం మెచ్చిన జన నాయకుడు సూదిని జైపాల్ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం ఉత్తమ పార్లమెంటేరియన్ జయంతి. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని స్పూర్తి స్థల్ లో జైపాల్ రెడ్డి సమాధి వద్ద పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర పౌర సరఫరాల, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు.
ఈ సందర్బంగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. జైపాల్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పాలమూరు జిల్లా మాడుగుల గ్రామంలో జనవరి 16న 1942లో పుట్టారు. ఆయన కారణ జన్ముడంటూ కొనియాడారు. ఇలాంటి నాయకులు అరుదుగా పుడుతుంటారని అన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్ లో డబుల్ పీజీ చేశారు సూదిని జైపాల్ రెడ్డి. ఆయన ప్రధానంగా వక్తగా, రచయితగా, ది బెస్ట్ పార్లమెంటేరియన్ గా వినుతికెక్కారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో ప్రతిపక్ష నేతగా ప్రశ్నల వర్షం కురిపించారు.