జనసేనలో చేరిన పృథ్వీ రాజ్
కండువా కప్పిన పవన్ కళ్యాణ్
మంగళగిరి – ప్రముఖ సినీ నటుడు పృథ్వీ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జన సేన పార్టీలో చేరారు. బుధవారం అమరావతి రాష్ట్రంలోని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి తన కుటుంబంతో కలిసి వచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. జనసేన పార్టీ కండువాను పృథ్వీ రాజ్ కు కప్పారు. సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా పృథ్వీ రాజ్ అంటేనే మోస్ట్ పాపులర్ హీరో. ఆయనలో అద్భుతమైన నటుడు దాగి ఉన్నాడు. నటుడిగా పలు సినిమాలలో నటిస్తూనే గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీలో కీలక పాత్ర పోషించారు. అక్కడ సాంస్కృతిక కళా విభాగాన్ని బలోపేతం చేశారు. ఊహించని రీతిలో ఏపీలో జగన్ సర్కార్ కొలువు తీరింది.
ఆ వెంటనే పృథ్వీ రాజ్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది. కానీ అనూహ్యంగా ఆయన ఆ పదవి నుంచి తప్పు కోవాల్సి వచ్చింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారనే దానిపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరకు జగన్ రెడ్డిని, పార్టీని ఏకి పారేస్తూ వచ్చారు. ప్రస్తుతం జనసేనలో కీలక భూమిక పోషించేందుకు పార్టీలో చేరారు.