జన నేత జైపాల్ రెడ్డి
తుమ్మల నాగేశ్వర్ రావు
హైదరాబాద్ – జనం మెచ్చిన నాయకుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. తెలుగు ప్రజలు గర్వించ దగిన మహోన్నత నాయకుడు జైపాల్ రెడ్డి అని పేర్కొన్నారు మంత్రి.
ఇవాళ ఆయన లేక పోవడం మనందరికీ బాధ కలిగించే విషయమన్నారు. సమకాలీన రాజకీయాలలో జైపాల్ రెడ్డి అరుదైన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన జీవితం ఆదర్శ ప్రాయమన్నారు. చివరి దాకా తాను నమ్ముకున్న సిద్దాంతానికి, సమాజానికి అంకితం అయ్యారని తెలిపారు తుమ్మల నాగేశ్వర్ రావు.
ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం పని చేశారని, విలువలే ప్రామాణికంగా తన ప్రస్థానం కొనసాగించారని అన్నారు. ఆయన మన తెలుగు జాతికి చెందిన వారు కావడం మనందరికీ గర్వ కారణమన్నారు మంత్రి. ఆయనతో కలిసి పని చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు .
ఆయన లేని లోటు తెలుగు వారికే కాకుండా యావత్ భారత దేశానికి కూడా తీరని లోటు అని పేర్కొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి. సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వారు. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డికి బంధువు అవుతారు.