టీఎస్పీఎస్సీ పేరు నిలబెడతా
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ
హైదరాబాద్ – తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు మాజీ డీజీపీ నూతన చైర్మన్ మహేందర్ రెడ్డి. గణతంత్ర దినోవ్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా సంతకం చేశారు. తన సీటులో ఆశీసునలయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు మహేందర్ రెడ్డి.
తాను తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినని, ఓ రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చానని, నిరుద్యోగుల బాధ ఏమిటో తనకు స్వయంగా తెలుసన్నారు. తనపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ తెలిపారు.
ఎవరికీ ఇబ్బంది లేకుండా మొత్తం కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని, సమర్థవంతంగా, పూర్తి పారదర్శకతతో ఖాళీలను భర్తీ చేస్తామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇక నుంచి విద్యార్థులు, ఉద్యోగార్థులు, నిరుద్యోగులు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు.
కష్టపడి చదువుకుని , ప్రిపేర్ అయి, పరీక్షలు రాసిన వారికి మెరిట్ ప్రకారం జాబ్స్ దక్కుతాయని స్పష్టం చేశారు మహేందర్ రెడ్డి.