NEWSTELANGANA

టీఎస్పీఎస్సీ పోస్టుల‌కు భారీ డిమాండ్

Share it with your family & friends

పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తుల వెల్లువ

హైద‌రాబాద్ – గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో తీవ్ర అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ)కి రూపు రేఖ‌లు మార్చే ప‌నిలో ప‌డింది కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ బి. జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు స‌భ్యులు రాజీనామా చేశారు.

వీరంతా గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ కు స‌మ‌ర్పించారు. ఆమె కొంత కాలం పాటు వీరి రాజీనామాల‌ను ఆమోదించ లేదు. దీంతో ఉత్కంఠ నెల‌కొంది. ఆమె ఆమోదం తెలిపితేనే కానీ చైర్మ‌న్, స‌భ్యుల‌ను నియ‌మించేందుకు వీలు లేదు. ఇదే విష‌యాన్ని భారత రాజ్యాంగం స్ప‌ష్టం చేసింది.

దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ల‌క్ష‌ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ఈ ఏడాది లోపు పూర్తి చేయాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఇదే విష‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విన్న‌వించారు. చివ‌ర‌కు ఎట్టకేట‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ స‌మ్మ‌తించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం చైర్మ‌న్, స‌భ్యుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌రించింది. ఈనెల 18 వ‌ర‌కు తుది గ‌డువు విధించింది. ఇదిలా ఉండ‌గా ఈ పోస్టుల కోసం భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున అప్లై చేసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది.

కాగా ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించింది. ఆల్ ఇండియా స‌ర్వీస్ కు చెందిన వ్య‌క్తిని చైర్మ‌న్ గా నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం.