ANDHRA PRADESHNEWS

టీడీపీకి ప‌లువురు నేత‌లు గుడ్ బై

Share it with your family & friends

ఏపీలో చంద్ర‌బాబుకు బిగ్ షాక్
అమ‌రావ‌తి – ఏపీలో త్వ‌ర‌లో శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో జంపింగ్ జ‌పాంగ్ ల తాకిడి పెరిగింది. ఎవ‌రు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. తాజాగా ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీకి బిగ్ షాక్ త‌గిలింది. కీల‌క నేత‌లు ఆ పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఇదిలా ఉండ‌గా టీడీపీకి రాజీనామా చేసిన వారిలో మాజీ డిప్యూటీ మేయ‌ర్ గోగుల వెంక‌ట ర‌మ‌ణారావు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఉపాధ్య‌క్షుడు లింగ‌మ‌నేని శివ‌రాం ప్ర‌సాద్ , టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పొన్నూరు పెందుర్తి శ్రీ‌నివాస్ , మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు షేక్ అమానుల్లా రాజీనామా చేశారు.

వీరితో పాటు 49వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి , జిల్లా పార్టీ కార్య‌ద‌ర్శి నీలం వెంక‌ట నారాయ‌ణ‌, ఎన్టీఆర్ జిల్లా ఐ టీడీపీ అధ్య‌క్షుడు అద్దేప‌ల్లి శివ సుంద‌ర రాజు, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ చీఫ్ షేక్ క‌రీముల్లా, బీసీ సెల్ కార్య‌ద‌ర్శి అంగ‌డాల ఏడుకొండ‌లు, విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ షేక్ అబీబ్ , 41వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి వెల‌గలేటి భార్గ‌వ్ రాయుడు గుడ్ బై చెప్పారు.

34వ డివిజ‌న్ అధ్య‌క్షురాలు త‌స్లీమా భాను, ఉమ్మ‌డి కృష్ణా జిల్లా మాజీ కార్య‌ద‌ర్శి ఎన‌మ‌ద్ది నాగ‌మ‌ల్లేశ్వ‌ర్ రావు, 49వ డివిజ‌న్ అధ్య‌క్షులు నీలం మ‌నోజ్ బాబు, తెలుగు యువ‌త ఉపాధ్య‌క్షుడు స‌య్య‌ద్ ఫ‌యాజ్ హుస్సేన్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.