టీడీపీ కోసం కష్టపడ్డా మోసపోయా
ఎంపీ కేశి నేని షాకింగ్ కామెంట్స్
విజయవాడ – బెజవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్ట పడ్డానని అన్నారు.
పార్టీ కోసం తన శక్తినంతా ధార పోశానని, సమయం , డబ్బు వృధా చేసుకోవద్దంటూ తన అనుచరులు, శ్రేయోభిలాషులు చెప్పినా తాను వినిపించు కోలేదన్నారు. కానీ అసలైన సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు దెబ్బ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజాలపై పెట్టుకుని మోశానని చెప్పారు కేశినేని నాని. ప్రజల కోసం నిజాయితీగా కష్ట పడ్డానని, చివరకు తాను బాబు మాయలో పడి మోస పోయానని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ.
తాను మర్యాద పూర్వకంగా మాత్రమే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నానని చెప్పారు. అంతకు ముందు తనను ఎంపీ విజయ సాయి రెడ్డి కలిశారని, పార్టీలోకి రావాలని కోరారని తెలిపారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలేనని పేర్కొన్నారు విజయవాడ ఎంపీ.