ANDHRA PRADESHNEWS

టీడీపీ తీరుపై ప‌వ‌న్ గుస్సా

Share it with your family & friends

ముంద‌స్తు ప్ర‌క‌టిస్తే ఎలా

అమ‌రావ‌తి – ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత ఊపందుకున్నాయి. ప్ర‌స్తుతం చ‌తుర్ముఖ పోటీకి సిద్ద‌మవుతోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల జాబితా పూర్త‌యింది. తాజాగా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని టీడీపీ, ప‌వర్ స్టార్ నేతృత్వంలోని జ‌న‌సేన సంయుక్తంగా అసెంబ్లీ, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఉమ్మ‌డిగా కూడా ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో సీట్ల కేటాయింపుపై బాబు, ప‌వ‌న్ ప‌లుమార్లు భేటీ అయ్యారు..విస్తృతంగా చ‌ర్చించారు. కానీ సీట్ల పంప‌కాల్లో ఇంకా స‌యోధ్య కుద‌ర‌లేదు. ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి టీడీపీ కొన్ని స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది.

దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పొత్తు ధ‌ర్మం పాటించ‌క పోతే ఎలా అని నిల‌దీశారు. ఈ సంద‌ర్బంగా జ‌న‌సేన పార్టీ నేత‌ల‌కు స‌ర్ది చెప్పే ప్ర‌యత్నం చేశారు. నారా లోకేష్ పై కూడా ఆస‌క్తి వ్యాఖ్య‌లు చేశారు. త‌ను సీఎం ప‌ద‌వి గురించి మాట్లాడితే కూడా తాను మౌనంగా ఉన్నాన‌ని అన్నారు. కానీ ముందు వెనుకా ఆలోచించ‌కుండా కామెంట్స్ చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.