టీ20 టీమిండియా ఇదే
ప్రకటించిన బీసీసీఐ
ఆఫ్గనిస్తాన్ తో జరిగే టీ20 సీరీస్ కు సంబంధించి భారత జట్టును ఎంపిక చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ఈ జట్టుకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్కిప్పర్ గా వ్యవహరిస్తాడు. ఇక విరాట్ కోహ్లీకి అనూహ్యంగా అవకాశం ఇవ్వడం విస్తు పోయేలా చేసింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైంది. విచిత్రం ఏమిటంటే రోహిత్ , కోహ్లీని తప్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని పక్కన పెట్టేసింది బీసీసీఐ. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ దక్కుతుందని అంతా భావించారు. కానీ గాయపడడంతో రోహిత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. పాండ్యాతో పాటు సూర్య కుమార్ యాదవ్ ఫిట్ గా లేక పోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని
బీసీసీఐ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
పొట్టి ఫార్మాట్ కు సంబంధించి 14 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నారు శర్మ, కోహ్లీ. ఇటీవల దక్షిణాఫ్రికా టూర్ కు ఎంపికైన శ్రేయస్ , ఇషాన్ కిషన్ కు చోటు దక్కక పోవడం విస్తు పోయేలా చేసింది. ఇక బీసీసీఐ ఎంపిక చేసిన టీమ్ లో జైస్వాల్ , గిల్ , కోహ్లీ, వర్మ, రింకూ, జితేష్ శర్మ, సంజూ శాంసన్ , రోహిత్ శర్మ, శివమ్ దూబే, సుందర్ , అక్షర్ పటేల్ , రవి , కులదీప్ యాదవ్ , అవేష్ ఖాన్, అర్ష్ దీప్ ఉన్నారు.