NEWSANDHRA PRADESH

త‌మిళిసైకి షాక్ షా వార్నింగ్

Share it with your family & friends

అన్నామ‌లైపై కామెంట్స్

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయ‌న‌తో పాటు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు కూడా ఉన్నారు.

ఈ త‌రుణంలో విశిష్ట అతిథిగా హాజ‌ర‌య్యారు మాజీ గ‌వ‌ర్న‌ర్ హోదాలో త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్. ఆమె స‌భా వేదిక పైకి చేరుకోగానే అమిత్ షా వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ సంద‌ర్బ‌గా కేంద్ర హొం శాఖ మంత్రి సీరియ‌స్ అయ్యారు త‌మిళి సై పై.

తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప్ర‌స్తుత బీజేపీ చీఫ్ అన్నామ‌లై కొప్పు స్వామికి మాజీ బీజేపీ చీఫ్ గా ప‌ని చేసిన త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ కు మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇరువురు నేత‌ల మ‌ధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతోంది.

సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త‌మిళి సై , అన్నామ‌లై ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. బీజేపీ ఓడి పోయేందుకు నువ్వే కార‌ణం అంటూ విమ‌ర్శించారు త‌మిళి సై. దీనిపై ఆరా తీశారు అమిత్ షా. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేయొద్దంటూ ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు . ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.