తలైవాతో నటించడం అదృష్టం
నటి మాళవికా మోహన్ కామెంట్స్
ప్రముఖ సినీ నటి మాళవిక మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినీ రంగానికి చెందిన సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ వ్యక్తిత్వం ప్రశంసనీయమని పేర్కొన్నారు. తను పెట్టా చిత్రంలో రజనీకాంత్ తో కలిసి నటించింది. ఈ సందర్బంగా సినిమా విడుదలై కొన్నేళ్లు అయినా ఇప్పటికీ ఆదరణ చూరగొంటోందని పేర్కొంది.
తను రజనీకాంత్ సార్ తో నటించేందుకు ముందు భయపడ్డానని , కానీ ఆయన చాలా కూల్ గా తనలో ఉన్న భయాన్ని పోగొట్టారని తెలిపింది మాళవికా మోహన్. తను 2018లో తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ చిత్రం మొదటి రోజు కొంత ఇబ్బందికి గురైనట్లు పేర్కొంది.
సెట్ లో భయం భయంగా కూర్చున్నా. అంత లోపే చాలా సాదా సీదాగా నడుచుకుంటూ లోపలికి వచ్చారు. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. సెట్ లో ఉన్న వారంతా గౌరవంగా లేచి నిల్చున్నారు. తలైవాకు నమస్కారం చేశారు.
అసోసియేట్ డైరెక్టర్ తనను రజనీకాంత్ కు పరిచయం చేశారు. చాలా ఉద్వేగానికి లోనయ్యానని, ఆ అపురూప క్షణాలు మరిచి పోలేనని పేర్కొన్నారు మాళవిక మోహన్. ఈ సందర్బంగా తనను ఆప్యాయంగా పలకరించారని, ఈ చిత్రంలో నటిస్తున్నందుకు అభినందనలు అంటూ చెప్పారని తెలిపారు.
ఆ తర్వాత భయం పోయింది. ప్రతి రోజూ సెట్ లో నా గురించి వివరాలు అడిగారు. కుటుంబ నేపథ్యం, చదువు గురించి కూడా. నా నటన, అభిరుచులు, ఆలోచనలు అన్నీ పంచుకున్నానని వెల్లడించారు. నాపై క్లాప్ కొట్టిన తొలి వ్యక్తి రజనీకాంత్ అని గుర్తు చేసుకున్నారు మాళవిక మోహన్. ఆయన లాంటి అరుదైన నటుడితో కలిసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు నటి.