తెలంగాణకు ఐపీఎస్ ల కేటాయింపు
ఆరుగురిని కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఇటీవల కొత్తగా సీఎంగా కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను కలుసుకున్నారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మరింత మెరుగు పర్చాలంటే, ట్రాఫిక్ ను నియమింత్రాలంటే కావాల్సినంత పోలీస్ బలగం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖను కేంద్ర హోం శాఖ మంత్రికి అందజేశారు.
ఈ సందర్బంగా తమకు కనీసం 20 మంది ఐపీఎస్ లు కావాలని, వెంటనే కేటాయించాలని కోరారు. సీఎం కోరికను మన్నించారు అమిత్ షా. వెంటనే హోం శాఖ కార్యదర్శిని ఆదేశించారు. దీంతో కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.
తాజాగా 2022 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్స్ లు ఆరుగురిని కేటాయించినట్లు తెలిపింది. వీరిలో ఆయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, మనన్ భట్, పత్తిపాక సాయి కిరణ్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను కేటాయించింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ప్రస్తుతం దావోస్ టూర్ లో ఉన్నారు.