తెలంగాణలో సిస్ట్రా డిజిటల్ సెంటర్
1,000 మందికి ఉపాధి కల్పన
హైదరాబాద్ – ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీకి ఎనలేని ప్రయారిటీ పెరిగింది. ఈ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది సిస్ట్రా డిజిటల్ టెక్నాలజీ కంపెనీ. ఈ మేరకు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు.
డిజిటల్ టెక్నాలజీ ప్రభుత్వానికి ఎంతగా అవసరం పడుతుందనే విషయంపై వారు మంత్రి దృష్టికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా టెక్నాలజీ పరంగా మరింత సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు కంపెనీ ప్రతినిధులు.
ఇందులో భాగంగా తెలంగాణలో సిస్ట్రా డిజిటల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీని వల్ల కనీసం 1,000 మందికి పైగా ఉపాధి దక్కుతుందని చెప్పారు. ఇదే సమయంలో మరింత సమర్థవంతమైన పబ్లిక్ సర్వీసెస్ , ఇంజనీరింగ్ వ్యవస్థలను రూపొందించడంలో సిస్ట్రా డిజిటల్ టెక్నాలజీ కంపెనీ సర్కార్ కు తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు.