తెలంగాణ కోటి రతణాల వీణ
అద్బుతమైన కట్టడం గోలకొండ
హైదరాబాద్ – తెలంగాణ ప్రాంతానికి ఘణమైన చరిత్ర ఉందని, పోరాటాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరని కొనియాడారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. హైదరాబాద్ లోని గోల్కొండ కోట వద్ద చరిత్ర తెలిసేలా కేంద్ర సర్కార్ సౌండ్ అండ్ లైట్ షోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో మాట్లాడారు కేంద్ర మంత్రి. చారిత్రక సంపద అనేది భావి తరాలకు ఉపయోగ పడుతుందన్నారు. అందుకే తమ ప్రభుత్వ హయాంలో కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దేశ వ్యాప్తంగా చారిత్రిక కట్టడాలు, స్మృతులు, ప్రాంతాలను ఎంపిక చేసి వాటిని అభివృద్ది చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
చరిత్ర అన్నది ప్రతి ఒక్కరు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. మనం బాగు పడాలంటే గత చరిత్ర ముఖ్యమన్నారు. భారతీయ సంస్కృతి, నాగరికత గొప్పదన్నారు. ఇదే సమయంలో తెలంగాణ సంస్కృతి, నాగరికత గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన లైట్ షో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.