తెలంగాణ మణిహారం మేథో శిఖరం
తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
దావోస్ – దివంగత నాయకుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన సూదిని జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు దగ్గరి బంధువు కూడా. ఉమ్మడి పాలమూరు జిల్లా మాడ్గుల గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి పుట్టుకతో వికలాంగుడైనప్పటికీ అంచెలంచెలుగా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు.
జనవరి 16న మంగళవారం జైపాల్ రెడ్డి జయంతి. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడి నుంచి ట్విట్టర్ వేదికగా సూదిని జైపాల్ రెడ్డిని స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా జైపాల్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి అరుదైన నాయకుడు ఈ నేలపై పుట్టడం మనందరికి గర్వ కారణమని అన్నారు రేవంత్ రెడ్డి.
జైపాల్ రెడ్డి తన జీవిత కాలమంతా ప్రజల కోసం పని చేశారని, వారి సమస్యలను వినిపించారని గుర్తు చేశారు. ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంట్ లో జైపాల్ రెడ్డి తన బాణిని వినిపించారని అన్నారు సీఎం.