త్వరలోనే బాబు..పవన్ ఢిల్లీకి
పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్న నేతలు
అమరావతి – ఏపీలో రాజకీయాలు మారనున్నాయి. రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీని నామ రూపాలు లేకుండా చేయాలని టీడీపీ, జనసేన కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగా తనపై కక్ష కట్టి, అవమానాలకు గురి చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇంటికి పంపించాలని కోపంతో ఊగి పోతున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
మరో వైపు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం బాబుతో జత కట్టారు. ఈసారి టీడీపీ, జనసేన కలిసికట్టుగా ముందుకు వెళతాయని, కూటమిగా బరిలో ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో జనసేన పార్టీతో పొత్తు కొనసాగిస్తూ వస్తున్నామని బీజేపీ స్పష్టం చేసింది.
అయితే టీడీపీతో జనసేన అంట కాగడాన్ని జీర్ణించు కోలేక పోతోంది. అయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగాలని, అలా అయితేనే ఏపీలో పవర్ లోకి రాగలమని పవన్ కళ్యాణ్ ఇప్పటికే హైకమాండ్ తో టీడీపీతో పొత్తు ఉంటే బాగుంటుందని ఇప్పటికే సూచించారు.