దావోసులో సీఎంకు ఘన స్వాగతం
జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో ఎన్నారైలు
దావోస్ – పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు, తెలుగు వారు భారీ ఎత్తున సాదర స్వాగతం పలికారు.
గత ప్రభుత్వం కంటే భిన్నంగా తాము వ్యవహరిస్తామని, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు, ఔత్సాహికులైన పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలుకుతున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. ఎవరితోనూ పేచీలు ఉండవని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇదే సమయంలో 36 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారని వారందరికీ ఉపాధి కల్పించాలనే దానిపై ఫోకస్ పెడుతున్నామని పేర్కొన్నారు.
ఏక కాలంలో జాబ్స్ ఇవ్వడం ఎవరికీ కుదరదని , ఇదే సమయంలో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంతో పోటీ పేడేలా యువతకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను తయారు చేయాలని సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు.
ఇక దావోస్ లో జరిగే సమ్మిట్ లో 70 మంది సిఇవోలు, చైర్మన్లు, ఎండీలు, వ్యాపారవేత్తలను కలవనున్నారు రేవంత్ రెడ్డి.