NEWSTELANGANA

దావోస్ లో న‌వ్వుల పాలైన సీఎం

Share it with your family & friends

అవ‌గాహ‌న లేకుండా మాట్లాడితే ఎలా

హైద‌రాబాద్ – దావోస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్ వేశారు బీఆర్ఎస్ అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్. ఇండియాకు చెందిన ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అసంబ‌ద్దంగా , త‌లా తోకా లేకుండా మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. దీని వ‌ల్ల సీఎంకు ఏమో కానీ తెలంగాణ ప‌రువు తీసేసేలా చేశార‌ని ఆరోపించారు.

బుధ‌వారం దాసోజు శ్ర‌వ‌ణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దావోస్ లో ఏదో మాట్లాడ బోయి న‌వ్వుల పాల‌య్యారంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచ వేదికపై తన అసంబద్ధమైన, అస్థిరమైన , అసమర్థ ప్రతిస్పందనలతో రాష్ట్రానికిఅపకీర్తి తీసుకు రాకూడ‌ద‌ని సూచించారు.

అణు రియాక్షన్, రింగ్ రోడ్లు, డూప్లికేట్ వంటి రాజకీయ వ్యాఖ్యలు అన‌వ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒన‌గూరేది ఏమీ ఉండ‌ద‌న్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ సమ్మిట్‌కు హాజరయ్యే రాష్ట్ర అధిపతి ఆర్థిక విధానాలలో సమర్థతను, అభివృద్ధికి స్పష్టమైన దృష్టి, నియంత్రణ పారదర్శకత, అనుకూలమైన వ్యాపార వాతావరణానికి నిబద్ధతను ప్రదర్శించాలని స్ప‌ష్టం చేశారు.

ప్రభావ వంతమైన కమ్యూనికేషన్, వృద్ధి అవకాశాలను ప్రదర్శించడం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం అనేది ప్రపంచ వేదికపై పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతుంద‌ని తెలిపారు. రేవంత్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్యలు దేనినీ ప్రతిబింబించక పోగా పరిపాలనా దృక్పథం లోపాన్ని స్పష్టంగా చూపుతున్నాయి . అపరిపక్వతను కూడా సూచిస్తున్నాయని పేర్కొన్నారు.