దావోస్ లో రేవంత్ బిజీ బిజీ
కంపెనీల ప్రతినిధులతో చర్చలు
దావోస్ – తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా మారారు. సీఎం సారథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నతాధికారుల బృందం ప్రస్తుతం దావోస్ లో కొలువు తీరింది.
ఈ టూర్ మూడు రోజుల పాటు కొనసాగుతోంది. టూర్ లో భాగంగా దావోస్ లో వివిధ కంపెనీలకు చెందిన ప్రముఖులు, కార్పొరేట్ సిఇఓలు, చైర్మన్లు కూడా ఉన్నారు. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఉన్నారు. వీరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేసేందుకే తాము దావోస్ కు వెళ్లినట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫాక్స్ కాన్ కంపెనీ ఇప్పటికే రూ. 3,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు తెలంగాణలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపించాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.