దేశమంతటా దీపోత్సవం
ప్రతి ఇంటా రామ దీపం వెలగాలి
న్యూఢిల్లీ – సుదీర్ఘ కల సాకారమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొలువు తీరిన వెంటనే చేసిన ఏకైక ప్రకటన ఎన్ని కోట్లు అయినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నభూతో నభవిష్యత్ అన్న రీతిలో రామాలయాన్ని నిర్మించి తీరుతామని. ఆయన చెప్పినట్టు చేసి చూపించారు. 22 జనవరి 2024 చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందని స్పష్టం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
కోట్లాది మంది అయోధ్య లోని రామాలయంలో శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తింది. ఎక్కడ చూసినా రామ నామ సంకీర్తనలే, భజనలే. పల్లెలు, పట్టణాలు, నగరాలన్నీ శ్రీరాముడి తో నిండి పోయాయి.
ఇక అయోధ్య దేదీప్యమానంగా వెలిగింది. ఈ సందర్బంగా దీపోత్సవాన్ని చేపట్టారు. అయోధ్య నగరంలోని సరయూ నది ఒడ్డున 14 లక్షల దీపాలు వెలిగించారు శ్రీరామ భక్తులు. ఇది ఓ రికార్డ్. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళే నిజమైన దీపావళి పండుగ వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంట్లో రామ దీపాన్ని వెలిగించాలని కోరారు.