దేశమంతటా శ్రీరామ శోభ యాత్ర
మారుమ్రోగుతున్న జై శ్రీరామ్ నినాదం
న్యూఢిల్లీ – జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది గొంతుకలు ఒక్కటై నినదిస్తున్నాయి. దేశమంతటా శ్రీరామ నామ జపంతో దద్దరిల్లుతోంది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ , ఏబీవీపీతో పాటు కాషాయ సంస్థలు, ప్రతినిధులు పండుగ చేసుకుంటున్నారు. భారత దేశాన్ని హిందూ భారతంగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నారు.
ఎప్పుడైతే కరుడుగట్టిన హిందూవాదిగా పేరు పొందిన నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరారో ఆరోజే అయోధ్య లోని రామ మందిరాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కట్టి తీరుతానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆ దిశగా ఆయన ప్రయాణం సాగించారు. బీజేపీ కొలువు తీరి పదేళ్లు అవుతోంది.
కోట్లాది రూపాయలతో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం, ఆలయం రూపు దిద్దుకుంది. యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. ఈనెల 22న సోమవారం పునః ప్రతిష్ట కార్యక్రమానికి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాని 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేపట్టారు. శ్రీరాముడికి సంబంధించి దేశంలో కొలువు తీరిన ఆలయాలను దర్శించడంలో బిజీగా ఉన్నారు.
రేపటి కార్యక్రమానికి మద్దతుగా శ్రీరాముడి శోభ యాత్రలతో దేశం అలరారుతోంది.