దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాలి
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
మణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తనపై అక్రమంగా కేసులు నమోదు చేయడంపై స్పందించారు. ఈ దేశానికి కావాల్సింది ప్రేమ అని ద్వేషం కాదన్నారు రాహుల్ గాంధీ. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ , అరుణాచల్ ప్రదేశ్ లలో ద్వేషం కొనసాగుతోందన్నారు. కేవలం మతం ఆధారంగానో లేక కులం ఆధారంగానో జాతిని చీల్చాలని అనుకోవడం మంచి పద్దతి కాదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ఆరు నూరైనా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరకు దాడులకు పాల్పడినా తాము వెనుకంజ వేసే ప్రసక్తి లేదన్నారు. ఈ దేశం కోసం, ప్రజల కోసం తాను భారత్ జోడో న్యాయ్ యాత్రను కొనసాగించి తీరుతామని చెప్పారు.
తన యాత్రను అడ్డుకోవాలని అడుగడుగునా ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. కేవలం వ్యక్తులను టార్గెట్ చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్నారు రాహుల్ గాంధీ. ఇకనైనా మోదీ ఆయన పరివారం మారాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే ఎవరూ ఈ దేశంలో మిగలరన్నారు.