SPORTS

దేశానికి రుణ‌ప‌డి ఉన్నా – ష‌మీ

Share it with your family & friends

అర్జున అవార్డు అందుకున్న క్రికెట‌ర్

న్యూఢిల్లీ – క్రీడా రంగానికి సంబంధించి అత్యున్న‌త‌మైన పుర‌స్కారంగా భావించే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ధానం చేసే అర్జున అవార్డును అందుకున్నారు ప్ర‌ముఖ క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. ఈ సంద‌ర్బంగా న్యూఢిల్లీలో జ‌రిగిన అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ష‌మీ అర్జున అవార్డును అందుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాన‌ని, ఏనాడూ నిరాశ‌కు లోను కాలేద‌న్నాడు.

ఇదే స‌మ‌యంలో ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్న పొందిన చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయి రాజ్ , రాంకిరెడ్డి ల‌ను ష‌మీ అభినందించారు. ఎంతో క‌ష్ట‌ప‌డితేనే కానీ ఈ స్థాయికి రాలేమ‌న్నాడు. త‌న‌లోని ప్ర‌తిభ‌ను గుర్తించి ప్రోత్స‌హించి వెన్ను త‌ట్టిన బీసీసీఐ మాజీ చీఫ్ , ప్ర‌ముఖ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీకి రుణ‌ప‌డి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

అంతే కాకుండా త‌న‌పై పూర్తి న‌మ్మ‌కం ఉంచి క్రికెట్ లో కొన‌సాగేందుకు ఎంపిక చేస్తూ వ‌స్తున్న భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి , ప్ర‌స్తుత చీఫ్ రోజ‌ర్ బిన్నీ, కార్య‌ద‌ర్శి జే షాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. రాబోయే రోజుల్లో త‌న వంతుగా శ్ర‌మిస్తాన‌ని, భార‌త దేశానికి , జ‌ట్టుకు పేరు తీసుకు వ‌చ్చేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు .