ద్వంద్వ పౌరసత్వానికి వ్యతిరేకం కాదు
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జై శంకర్
న్యూఢిల్లీ – కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ద్వంద్వ పౌరసత్వం గురించి చర్చ జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు జై శంకర్. పౌరసత్వం అనేది ముఖ్యమని, పౌరుల మధ్య సత్ సంబంధాలు కొనసాగించేందుకు ఇది దోహదంగా ఉంటుందన్నారు. ఇదే సమయంలో ద్వంద్వ పౌరసత్వం కల్పించడం వల్ల కొన్ని నష్టాలతో పాటు మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశార
అయితే ద్వంద్వ పౌరసత్వం కల్పించాలా లేదా అన్న దానిపై ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ నేతృత్వంలోని మంత్రి వర్గం విస్తృతంగా చర్చిందని తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ద్వంద్వ పౌరసత్వం కల్పించే విషయంపై తమ సర్కార్ కు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలని పదే పదే తాము ద్వంద్వ పౌరసత్వానికి వ్యతిరేకంగా ఉన్నామని ప్రచారం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు భారత దేశ ప్రభుత్వం ఎప్పటికీ వ్యతిరేకంగా కాదని కుండ బద్దలు కొట్టారు సుబ్రమణ్యం జై శంకర్. అయితే దానిని అమలు చేయడంలో అనేక రకాలైన ఆర్థిక, వాణిజ్య పరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.