నంద్యాల వద్దు గుంటూరు బెటర్
స్పష్టం చేసిన నటుడు అలీ
అమరావతి – ఏపీ వైసీపీలో టికెట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. ఒంగోలు సీటుపై తనకు ఆసక్తి లేదంటూనే మరో వైపు జగన్ ఇస్తానంటే వద్దంటానా అంటూ బాంబు పేల్చారు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఆయన జగన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తి. ఒక రకంగా జగన్ టీంలో తను కూడా ఒకడు.
తాజాగా ఎంపీ సీట్ల కేటాయింపులో ప్రముఖ నటుడు అలీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. మైనార్టీ కోటా కింద కనీసం రెండు సీట్లు ఇవ్వాలని అనుకున్నారు. కానీ కులాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒక సీటు కన్ ఫర్మ్ చేసేందుకు మొగ్గు చూపారు.
ఈ తరుణంలో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్ సభ స్థానానికి అలీని ఖరారు చేశారు. దీనికి నటుడు అలీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. తనకు ఆ సీటు వద్దని , వీలైతే గుంటూరు ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని జగన్ రెడ్డిని కోరినట్లు టాక్.
ఇదిలా ఉండగా ఏపీలో గుంటూరుతో పాటు నంద్యాల సీట్లలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే అలీకి నంద్యాల బెటర్ అంటూ చెప్పినా ఒకింత మౌనంగా ఉన్నట్టు సమాచారం.