నాలుగు లేన్ల రింగ్ రోడ్ ప్రతిపాదన
ప్రాంతీయ రింగ్ రోడ్డంటూ పేరు
హైదరాబాద్ – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరింత మేలు చేకూర్చేలా కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ను ప్రతిపాదించింది. ఇందులో నాలుగు లేన్ల రోడ్ కు ప్లాన్ తయారు చేసింది సర్కార్.
ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 340 కిలోమీటర్ల నియంత్రిత ఎక్స్ ప్రెస్ వే త్వరలో హైదరాబాద్ లో వాస్తవ రూపం దాల్చనుంది. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా అభివృద్ది చేస్తారు. ఉత్తర భాగం, దక్షిణ భాగాలుగా విభజించింది ప్రభుత్వం.
ఇక ఉత్తర భాగానికి సంబంధించి సంగా రెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్ , గజ్వేల్ , యాదాద్రి, ప్రజ్ఞాపూర్ , భోంగీర్ , చౌటుప్పల్ ప్రాంతాలను కలుపుతూ 164 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. ఇక దక్షిణ భాగంలో చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్ గల్, చేవెళ్ల, శంకర్ పల్లి, సంగారెడ్డి ప్రాంతాలను కలుపుతూ దాదాపు 182 కిలోమీటర్లకు పైగా రహదారి ఏర్పాటు కానుంది.
ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ లో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి 3 నెలల్లో భూ సేకరణ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయా పనుల్లో బిజీగా ఉన్నారు.