NEWSTELANGANA

నా పంతం బీఆర్ఎస్ అంతం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆయ‌న పనై పోయింద‌న్నారు. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీని అంతం చేయ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు. త‌నంత‌కు తాను కేసీఆర్ పులి అని అనుకుంటున్నాడ‌ని, ప్ర‌స్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడ‌ని ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చాక బోనులో పెట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ ను పాతి పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

కేసీఆర్ కు వేసే ప్ర‌తి ఓటు మోడీకి వేసిన‌ట్టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ దేశానికి స్వేచ్ఛ‌ను తీసుకు వ‌చ్చింద‌ని, ఆ స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి మోదీ, పెంపుడు కుక్క ఏమి చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి 63 ల‌క్ష‌ల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జ‌మ అవుతుంద‌న్నారు. మీరు ఎద్దేవా చేసిన‌ట్లు తాను గుంపు మేస్త్రీనేనంటూ పేర్కొన్నారు. తెలంగాణ‌లో మీరు చేసిన విధ్వంసాన్ని, నిరుద్యోగుల‌కు చేసిన మోసం చేసిన విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.