నిధుల కేటాయింపుపై సీఎంకు థ్యాంక్స్
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
హైదరాబాద్ – ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా నియోజకవర్గ అభివృద్ది పనుల కోసం అడిగిన వెంటనే రూ. 10 కోట్లు కేటాయించారని వెల్లడించారు. ఇప్పటికే తమకు కూడా నిధులు కేటాయించాలని కోరారు ఎస్సీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు, లక్ష్మణ్ కుమార్ .
ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. తాజాగా కేటాయించిన నిధులతో నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం నిధులను యుద్ద ప్రాతిపదికన చేపడతామని, ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రెండు గ్యారెంటీలను అమలు చేసిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.
అంతే కాకుండా రైతు బంధు పథకం కింద దశల వారీగా ఇప్పటి వరకు 50 శాతానికి పైగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేశామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.