నేటి నుంచి బాల రాముడి దర్శనం
సామాన్య భక్తులకు సైతం అవకాశం
అయోధ్య – ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యాన్ని ప్రసాదించనుంది ఆలయ కమిటీ. జనవరి 22న అంగరంగ వైభవోపేతంగా రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు. ఆయనే ప్రాణ ప్రతిష్ట చేశారు. 500 ఏళ్లుగా ఇది నానుతూ వచ్చింది. చివరకు మోదీ హయాంలో భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది.
దీంతో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. పల్లెలు, పట్టణాలు, నగరాలలో దీపాలను వెలిగించారు భక్తులు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ ఈ దేశానికి నిజమైన దీపావళి వచ్చిందన్నారు.
ఇదిలా ఉండగా రామ మందిరం ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు సైతం బాల రాముడి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సమయం ఖరారు చేసింది.
ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా బాల రాముడి దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించింది.