నేను పక్కా వైఎస్సార్ రక్తం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాను ఏమిటి అనేది ఇంకొకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదన్నారు. తానేమిటో, తన క్యారెక్టర్ ఏమిటో జనానికి తెలుసన్నారు. ఎవరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులో తెలుసని అన్నారు. ఎవరో తనకు కితాబు ఇచ్చినంత మాత్రాన తన విలువ ఎక్కవ కాదన్నారు. పోనీ వ్యక్తిగత విమర్శలు చేసినా తనకున్న పేరుకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదన్నారు.
రాజకీయాలలో తాను ముందు నుంచీ ఉన్నానని, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు బాగా తెలుసన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. నాది, నా కుటుంబానికి పక్కా వైఎస్ రక్తం నుంచి వచ్చిందేనని పేర్కొన్నారు. నా బిడ్డకు రాజా రెడ్డి అని పేరు పెట్టింది కూడా తన తండ్రేనని గుర్తు చేశారు.
అయితే నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. వైఎస్సార్ ఆశయాలను సాధించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. నాతో ఇంత కాలం ఉన్న వారు, తనతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన వారు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వాటిని తాను పట్టించు కోనంటూ ప్రకటించారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు.