పండుగ వేళ బాబు ఆనంద హేళ
భోగి వేడుకల్లో పవన్ కళ్యాణ్..నారా
అమరావతి – రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. కొత్త బట్టలు ధరించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. భోగి మంటలు కొనసాగుతున్నాయి. ఫెస్టివల్ ను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ మేనిఫెస్టోను భోగి మంటల్లో వేశారు. ఇక ఆయన రాక్షస పాలనకు అంతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు చంద్రబాబు నాయుడు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు నాయుడు. మకర సంక్రమణం అనేది కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదన్నారు.
మన జీవితంలో కూడా ప్రగతితో కూడిన మార్పు రావాలనే సందేశాన్ని ఈ సంక్రాంతి పండుగ మనకు ఇస్తుందని తెలిపారు. మీకు మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అడుగులు వేసేందుకు ఇది సరైన సమయమని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు
5 ఏళ్ల రాతి యుగానికి ముగింపు పలుకుతూ… స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు మాజీ సీఎం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.