పత్రికలు ప్రజల గొంతుకలు
మాస పత్రిక సీఎం విడుదల
హైదరాబాద్ – పత్రికలు ప్రజలకు గొంతుకగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఇటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు ప్రతిపక్షాల వాయిస్ ను కూడా వినిపించాలని సూచించారు. ఇదే నిజమైన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ప్రజలను దూరంగా ఉంచారని, మీడియాపై కూడా ఉక్కు పాదం మోపారని గుర్తు చేశారు.
తాము వచ్చాక ఇవాళ రాష్ట్రంలో స్వేచ్ఛ లభించిందన్నారు. ముందుగా పథకాల కంటే వారంతా దొర పాలనను వద్దని అనుకున్నారని, అది పోవాలనే తమను అందలం ఎక్కించారని అన్నారు. ప్రజల కోసం పని చేస్తే ఇవాళ కాక పోయినా రేపు అయినా ఆదరిస్తారని ఆ నమ్మకం తనకు ఉందన్నారు.
తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా తాను పట్టించు కోలేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ మాస పత్రిక మరింతగా ప్రజలకు చేరువయ్యేలా చూడాలని సూచించారు. సచివాలయంలో సీఎం మాస పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, పొన్నం, ఉత్తమ్ , సీతక్క, సలహాదారు నరేందర్ రెడ్డి, కమిషనర్ , అశోక్ రెడ్డి, సీపీఆర్వో అయోధ్య రెడ్డి, ఎడిటర్ శాస్త్రి పాల్గొన్నారు.